‘మిస్సైల్‌ మ్యాన్‌’కి సీఎం జగన్‌ నివాళి

AP CM YS Jagan And PM Modi Pays Tribute To APJ Abdul Kalam For His Birth Anniversary - Sakshi

సాక్షి, అమరావతి : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం 89వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ‘భారతరత్న డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం జీవితం కోట్లాదిమందికి స్ఫూర్తిదాయకం. మిస్సైల్‌ మ్యాన్‌గా, ప్రజల ప్రెసిడెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా  ఆయనకు నివాళులర్పిస్తున్నాను అంటూ సీఎం జగన్‌ ట్వీట్‌​ చేశారు.
 

దేశానికి ఎనలేని సేవ చేశారు : మోదీ
అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఒక శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఆయన చేసిన ఎనలేని సేవ చేశారని కొనియాడారు. ఆయన జీవితం కోట్లమందికి స్ఫూర్తిదాయకం అన్నారు. ఈమేరకు ఓ అబ్దుల్‌ కలాంకు సంబంధించిన ఓ వీడియోను షేర్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా అబ్దల్‌ కలాంకు నివాళులర్పించారు.  ‘డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఒక విజనరీ లీడర్, దేశ ఖ్యాతిని అంతరిక్షం వరకూ తీసుకువెళ్లారు. ఆయన నిరంతరం ఆత్మనిర్భర్ భారత్‌ కోసం తపించేవారు. విద్య, శాస్త్ర రంగాల్లో కలాం సేవలు నిరుపమానం. ప్రేరణదాయకం’ అని ట్వీట్‌ చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top