AP Assembly Budget Session: ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు: గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

AP Assembly Budget 2023-24 Session March 14 Day 1 Live Updates - Sakshi

Time: 12:19 PM
ఈ నెల 16న బడ్జెట్‌.. బీఏసీ నిర్ణయం..
స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన  బీఏసీ సమావేశం జరిగింది. 24 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎసీ నిర్ణయించింది. ఈ నెల 16న బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయించారు. సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చీఫ్ విప్ ప్రసాద్ రాజు, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

Time: 11:18 AM

రాష్ట్రంలో 56 కొత్త బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం
ఎస్సీల కోసం 3, ఎస్టీల కోసం ఒక కార్పొరేషన్‌
ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలకు 4 డిప్యూటీ సీఎం పోస్టులు
జడ్పీ ఛైర్మన్‌ పోస్టుల్లో 70 శాతం ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు ఇచ్చాం.
137 కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోస్టుల్లో 58 శాతం పోస్టులను ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు ఇచ్చాం.
15.14  లక్షల ఎస్సీ, 4.5 ఎస్టీ కుటుంబాలకు జగజ్జీవన్‌ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌
ప్రతి గ్రామ సచివాలయంలో ఆర్బీకే సెంటర్‌

వ్యర్థరహిత, చెత్త రహిత గ్రామాలే లక్ష్యంగా ఏపీ ముందుకెళ్తోంది.
స్వచ్ఛసర్వేక్షణ్‌లో ఏపీ ముందంజలో ఉంది
గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ద్వారా ఏపీకి భారీకి పెట్టుబడులు
గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ప్రథమస్థానంలో ఉంది
మాంసం ఉత్పత్తిలో ఏపీ రెండో స్థానంలో ఉంది
పాల ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానంలో ఉంది.

Time: 11:01 AM
గవర్నర్‌ ప్రసంగం..
వైద్యశాఖ ద్వారా 1.4 కోట్ల హెల్త్‌ కార్డులు
పీహెచ్‌సీలలో ఇద్దరు డాక్టర్లు ఉండేలా చర్యలు
వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్లు
ప్రతి నెల ఒకటో తేదీన వైఎస్సార్‌ పింఛన్‌ కానుక
వాలంటీర్ల ద్వారా ఇంటివద్దే పెన్షన్ల పంపిణీ
2024 నాటికి అర్హులైన ప్రజలకు శాశ్వత గృహాలు
మహిళల పేరిట 30.65 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ
నేతన్న నేస్తం కింద నేత కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు ఆర్థిక సాయం
81,783 మంది నేత కార్మికులకు రూ.788.5 కోట్ల పంపిణీ
జగనన్న చేదోడు ద్వారా 3.36 లక్షల మందికి రూ. 927,49 కోట్లు
వైఎస్సార్‌ బీమా కింద రెండేళ్లలో రూ.512 కోట్లు జమ చేశాం

Time: 10:51 AM
విద్యా సంస్కరణలో కీలక అంశంగా డిజిటల్‌ లెర్నింగ్‌
విద్యార్థులకు రూ.690 కోట్ల విలువైన 5.20 లక్షల ట్యాబ్‌ల పంపిణీ
జగనన్న విద్యా​కానుక కింద ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ఇంగ్లీష్‌ ల్యాబ్‌లు
2020-21 విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశ సంస్కరణలు అమలు
1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు రీడిజైన్‌
జగనన్న గోరుముద్దతో 43.26 లక్షల మందికి విద్యార్థులకు లబ్ధి
జగనన్న గోరుముద్ద ద్వారా ఇప్పటివరకు రూ.3,239 కోట్లు ఖర్చు
ఆర్థికభారం లేకుండా ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ

Time: 10:42 AM
గవర్నర్‌  ప్రసంగం..
రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు
కూరుపాంలో గిరిజన ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేశాం
కడపలో డా.వైఎస్సార్‌ ఆర్కిటైక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్ వర్శిటీ
అమ్మ ఒడి  ద్వారా 80 లక్షల మంది పిల్లలకు ఆర్థిక సాయం
44.49 లక్షల మంది తల్లులకు రూ.19,617.60 కోట్లు ఆర్థిక సాయం

Time: 10:15 AM
ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు వేసిందని, వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నామని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. తొలిసారి ఆయన అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. నవరత్నాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అవినీతికి తావులేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతోందని చెప్పారు. నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామన్నారు. వినూత్నంగా వాలంటీర్‌ వ్యవస్థ అమలు చేస్తున్నామని గవర్నర్‌ తెలిపారు.

►అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు.
►కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు.
►వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నాం.
►11.43 శాతం గ్రోత్‌ రేటును సాధించాం.
►ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందంజలో ఉంది.
►మనబడి నాడు-నేడు పథకాలతో విద్యారంగంలో సంస్కరణలు.

Time: 10:00 AM
ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి.  ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగిస్తున్నారు. 

గవర్నర్‌ నజీర్‌కు స్వాగతం పలికిన సీఎం జగన్‌

అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

Time: 9:47 AM

అసెంబ్లీకి చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌
సీఎం వైఎస్‌ జగన్‌ అసెంబ్లీకి చేరుకున్నారు. కాసేపట్లో గవర్నర్‌ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

కాసేపట్లో శాసనసభ బడ్జెట్‌ సమా­వేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాస­నసభ, శాసన మండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించను­న్నారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక ఆయన పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం ఇదే. నజీర్‌ ప్రసంగం తర్వాత రెండు సభలు వాయిదా పడనున్నాయి. 

స్పీకర్‌ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశం
ఆ తర్వాత స్పీకర్‌ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ (బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ) సమావేశం జరగనుంది. ఇందులో సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలి, రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీని నిర్ణయించనున్నారు. ఈ నెల 14 నుంచి 24 వరకు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

కనీసం 7, 8 రోజులు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కాగా మంగళవారం బీఏసీ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలోనే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులను కేబినెట్‌ ఆమోదించనుంది.

కీలకమైన 2023-24 వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 17వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 24వ తేదీ వరకు జరిగే అవకాశాలున్నాయి.

ఈ ఏడాది రూ. 2లక్షల 60 వేల కోట్లకు పైగా బడ్జెట్  ఉండే అవకాశం కనిపిస్తోంది. సంక్షేమంతో పాటు వ్యవసాయం,   విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత  ఇచ్చే విధంగా బడ్జెట్ రూపకల్పన దిశగా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. పైగా వచ్చే ఏడాదిలో ఎన్నికల నేపథ్యంలో ఇదే పూర్తి స్థాయి బడ్జెట్‌ కావడంతో దృష్టి సారించింది. మరోవైపు కీలక అంశాలపై అసెంబ్లీలో  సీఎం జగన్‌  ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది. నాలుగేళ్ల పాలనతో పాటు మూడు  రాజధానులు, సంక్షేమం, వైజాగ్  గ్లోబల్  సమిట్ ముఖ్యమైన  అంశాల ఎజెండాతో సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top