
తిరుమల కొత్త ఈఓగా మళ్లీ అనిల్‌కుమార్ సింఘాల్.. సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శిగా శ్యామలరావు
గవర్నర్ ప్రత్యేక సీఎస్‌గా జి. అనంతరాము, ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్‌కుమార్
ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
సాక్షి, అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ)తో సహా పలువురు ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. టీటీడీ ఈఓగా రెండేళ్ల పదవీ కాలం పూర్తికాకుండానే జె. శ్యామలరావును తప్పించింది. గతంలో చంద్రబాబు సర్కారులో పనిచేసిన అనిల్‌కుమార్ సింఘాల్‌ను మళ్లీ టీటీడీ ఈఓగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
శ్యామలరావును సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కొన్ని శాఖల కార్యదర్శి, కమిషనర్ పోస్టులు రెండూ ఒక్కరికే అప్పగించింది. అంటే.. కమిషనర్‌గా ఆయనే ప్రతిపాదనలు పంపుతారు, కార్యదర్శిగా ఆయనే నిర్ణయాలు తీసుకుంటారు.
ఇలా.. మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్ శ్రీధర్‌ను నియమించగా, ఆయనకే మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ పూర్తి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. అలాగే, కారి్మక శాఖ కార్యదర్శిగా ఎంవీ శేషగిరిబాబును నియమించారు. ఆ శాఖ కమిషనర్‌గా కూడా ఆయనకే పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
