రెమ్‌డెసివిరే ప్రభావశీలి | American doctors says that Remdesivir is one of the most effective corona control drug | Sakshi
Sakshi News home page

రెమ్‌డెసివిరే ప్రభావశీలి

Oct 11 2020 4:20 AM | Updated on Oct 11 2020 4:20 AM

American doctors says that Remdesivir is one of the most effective corona control drug - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణకు వాడుతున్న మందుల్లో రెమ్‌డెసివిర్‌ అత్యంత ప్రభావశీలంగా ఉందని అమెరికన్‌ వైద్యులు వెల్లడించారు. సుమారు 1,062 మంది బాధితులకు వివిధ దశల్లో ఈ మందును వాడారు. మిగతా మందులతో పోలిస్తే దీని ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు. కోవిడ్‌ దశలను బట్టే కాకుండా, వివిధ వయసుల వారీగా కూడా మందును వినియోగించి తదనంతర ఫలితాలను సమీక్షించారు.  

పరిశీలనలో వెల్లడైన విషయాలు..  
► మొత్తం పది రోజుల కోర్సులో 200 ఎంజీ, ఆ తర్వాత 9 రోజులు 100 ఎంజీ డోసు వాడారు. 
► మొత్తం 1,062 మంది పేషెంట్లలో 541 మందిలో రెమ్‌డెసివిర్, 521 మందిలో ప్లాసిబోను వినియోగించారు.  
► రెమ్‌డెసివిర్‌ వాడిన వారు 10 రోజుల్లో కోలుకోగా, ప్లాసిబో వాడిన వారు కోలుకునేందుకు 15 రోజులు పట్టింది. 
► రెమ్‌డెసివిర్‌ వాడిన వారిలో మరణాలు 6.7 శాతం కంటే తక్కువగా నమోదయ్యాయి.  
► ప్రతికూల ఫలితాలు చూసినా.. ప్లాసిబో కంటే రెమ్‌డెసివిర్‌లో తక్కువగా ఉన్నట్టు తేలింది.  
► శ్వాస తీసుకోవడం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రెమ్‌డెసివిర్‌ తీసుకోవచ్చని వైద్యులు చెప్పారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement