
ఏపీ జెన్‌కో ఎండీగా ఎస్.నాగలక్ష్మి
ఎక్సైజ్, ప్రొహిబిషన్ డైరెక్టర్‌గా చామకూరి శ్రీధర్
ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు ఇస్తూ మరి కొంతమంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఎస్.నాగలక్ష్మీని ఏపీ జెన్‌కో మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు.
ప్రస్తుతం ఏపీ జెన్‌కో మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కె.వి.ఎన్.చక్రధర్ బాబును బదిలీ చేశారు. చామకూరి శ్రీధర్‌ను ఎక్సైజ్, ప్రొహిబిషన్ డైరెక్టర్‌గా, బి.ఆర్.అంబేడ్కర్‌ను స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్స్ ఐజీగా నియమించారు. ప్రస్తుతం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా పూర్తి అదనపు బాధ్యతలు చూస్తున్న వీరపాండియన్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు.