మడకశిర రూరల్: డాక్టర్ వైఎస్సార్ ప్రభుత్వ ఉద్యాన విశ్వ విద్యాలయం పరిధిలోని కళాశాలల్లో ఉద్యాన, ల్యాండ్ స్కేపింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2026–2027 విద్యా సంవత్సరానికిగాను ఉద్యాన పాలిటెక్నిక్‌లో ప్రవేశాలకు పదో తరగతి ఉత్తీర్ణులైన లేదా తత్సమాన తరగతుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని స్థానిక ప్రభుత్వ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బయ్యన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9వ తేదీ (శుక్రవారం) నుంచి 23వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆసక్తి కలిగిన వారు https:// drysrhu.ap.gov.in వెబ్‌సైట్ చూడాలన్నారు. మడకశిర ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలకు ప్రభుత్వం 60 సీట్లు కేటాయించిందన్నారు. వూర్తి వివరాల కోసం 7382633687,9182677322, 9492328008 నంబర్లలో సంప్రదించాలన్నారు.


