రాయదుర్గం టౌన్: స్థానిక కోటలో వెలసిన ప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీవారి పార్వేట ఉత్సవం, అశ్వవాహనోత్సవం కనులపండువగా సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు వేంకటరమణస్వామి దర్శనమిచ్చారు. రాయదుర్గం రెడ్డి సంక్షేమ సంఘం, ఆరెకటిక, నాయీబ్రాహ్మణ, ఈడిగ సంఘాల ఆధ్వర్యంలో సాగిన ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం వసంతోత్సవం, సాయంత్రం మయూర వాహన సేవలు ఉంటాయని ఈఓ నరసింహారెడ్డి తెలిపారు.


