ఆత్మకూరు మండలానికి చెందిన టీడీపీ నేత ఒకరు ఓ రైతును సంప్రదించి పొలంలోని మట్టి తోలుకుంటాం.. ఇందుకుగాను కొంత డబ్బు ఇస్తాం అని ప్రతిపాదించారు. అప్పటికే కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్న ఆ రైతు సరే అని ఒప్పుకున్నాడు. ఇంకేముంది ఆ నేత పొలంలోకి జేసీబీ తీసుకొచ్చి మట్ | - | Sakshi
Sakshi News home page

ఆత్మకూరు మండలానికి చెందిన టీడీపీ నేత ఒకరు ఓ రైతును సంప్రదించి పొలంలోని మట్టి తోలుకుంటాం.. ఇందుకుగాను కొంత డబ్బు ఇస్తాం అని ప్రతిపాదించారు. అప్పటికే కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్న ఆ రైతు సరే అని ఒప్పుకున్నాడు. ఇంకేముంది ఆ నేత పొలంలోకి జేసీబీ తీసుకొచ్చి మట్

Apr 14 2026 8:04 AM | Updated on Apr 14 2026 8:04 AM

వై.కొత్తపల్లి వద్ద హంద్రీ నీవా కాలువ పక్కనే జేసీబీతో మట్టిని టిప్పరుకు వేస్తున్న దృశ్యం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు సంపాదన కోసం బరి తెగిస్తున్నారు. అధికారిక అనుమతులు లేకుండానే వై.కొత్తపల్లి, వడ్డుపల్లి తదితర ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. పొలం, గుట్టలు, కొండలే కాదు ఏకంగా కాలువ గట్లనూ వదలడం లేదు. నీటి ప్రవాహం పెరిగినప్పుడు కాలువలకు గండిపడే ప్రమాదం ఉన్నా వెనక్కు తగ్గడం లేదు. ఎమ్మెల్యే పరిటాల సునీత అండతోనే ఇలా చెలరేగిపోతున్నారని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్‌, మైనింగ్‌, పోలీసు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.

కంటికి కనిపించవా..?

టీడీపీ నేతలు నాణ్యమైన మట్టి కోసం ఏకంగా వై.కొత్తపల్లి వద్ద హంద్రీ –నీవా కాలువ గట్టు సమీపాన హిటాచీ, జేసీబీలను పెట్టి తవ్వకాలు మొదలు పెట్టారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా తవ్వడం.. టిప్పర్ల ద్వారా తరలించడం యథేచ్ఛగా సాగుతోంది. కాలువకు ఆనుకుని మట్టిని తవ్వితే కేసులు పెడుతామన్న ఇరిగేషన్‌ అధికారుల హెచ్చరికలు ఇక్కడ పనిచేయడం లేదు. సామాన్యులపై మాత్రమే వారు ప్రతాపం చూపుతారన్న విమర్శలు ఉన్నాయి. వందల సంఖ్యలో టిప్పర్ల మట్టి తరలిస్తున్నా ఇరిగేషన్‌ అధికారుల కంటికి ఎందుకు కనిపించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మట్టి తవ్వకాల్లో దూకుడు

భవన నిర్మాణాలు, లేఅవుట్లకు మట్టి అవసరం. అందులో నాణ్యమైన మట్టికి డిమాండ్‌ ఎక్కువగా ఉంది. అనంతపురంలో ఒక టిప్పర్‌ మట్టి రూ.7 వేలకు పైగా పలుకుతోంది. దీంతో ‘పచ్చ’ నేతలు గ్రామీణ ప్రాంతాల నుంచి రోజూ పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మట్టిని తరలించేస్తున్నారు. ఆత్మకూరు మండలం వై.కొత్తపల్లి వద్ద హంద్రీ–నీవా కాలువ పక్కన, వడ్డుపల్లి సమీపంలోని అటవీ ప్రాంతం, మదిగుబ్బ దగ్గర కొండపై మట్టి తవ్వకాలు ఎక్కువగా సాగుతున్నాయి. బహిరంగంగా మట్టిని అక్రమంగా తరలిస్తున్నా ఏ అధికారీ పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోపాయికారి ఒప్పందంతోనే మట్టి దందా సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి.

యథేచ్ఛగా మట్టి తరలింపు

సొమ్ము చేసుకుంటున్న టీడీపీ నేతలు

చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement