మంచు కురిసే వేళలో..
అనంతపురం అగ్రికల్చర్: ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పతనమయ్యాయి. చలి తీవ్రత పెరగడంతో జనం గజ గజ వణుకుతున్నారు. గురువారం విడపనకల్లులో 10.03 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అటు శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి, మడకశిరలో కూడా 10.4 డిగ్రీలు నమోదైంది. అలాగే వజ్రకరూరు 11.2 డిగ్రీలు, గుమ్మఘట్ట 11.3 , తనకల్లు 11.4 , అమడగూరు 11.5 , శెట్టూరు 11.5 , బొమ్మనహాళ్ 11.7, నల్లచెరువుల, కణేకల్లు 11.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా మండలాల్లో ఈ సీజన్‌లోనే కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పగటి ఉష్ణోగ్రతలు కూడా 27 నుంచి 31 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపు రికార్డయ్యాయి. దీంతో చలి ప్రభావం బాగా పెరిగింది.


