ఇన్‌పుట్‌సబ్సిడీ ఇవ్వలేదు
ఈ ఏడాది అకాల వర్షాలకు మూడు ఎకరాల్లో సాగు చేసిన వేరుశనగ, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రూ.50 వేల వరకు నష్టం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు ఇన్‌పుట్ సబ్సిడీ గురించి మాట్లాడలేదు. ప్రభుత్వానికి నివేదిక పంపామని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కింద పరిహారం కానీ అందించలేదు. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా రైతు భరోసా, ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, సున్నా వడ్డీ లాంటి పథకాల కింద ఆర్థిక సాయం అందించారు. – జి.దాసన్న,
నంజాపురం, బ్రహ్మసముద్రం మండలం


