ప్రభుత్వ డ్రైవర్ల సంఘం నూతన కమిటీ ఎన్నిక
అనంతపురం అర్బన్: ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా నూతన కమిటీని ఆదివారం అనంతపురంలోని ఆదిమూర్తినగర్‌లో ఉన్న ఆ సంఘం కార్యాలయంలో ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపారావు వ్యవహరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా డి.రవీంద్ర, ప్రధాన కార్యదర్శిగా సీకే లక్ష్మన్న, గౌరవాధ్యక్షుడిగా రామ్‌గోపాల్, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎస్.డేవిడ్, ఉపాధ్యక్షులుగా పి.మాబూసాహెబ్, శ్రీనివాసులు నెహ్రూ, సహాయ కార్యదర్శిగా పెంచలయ్య, కార్యనిర్వాహక కార్యదర్శిగా సురేష్, ప్రచార కార్యదర్శిగా పి.ఆది, కార్యవర్గసభ్యుడిగా వెంకటమణ ఎన్నికయ్యారు.
ఎస్టీయూ జిల్లా కార్యవర్గం ఎన్నిక
అనంతపురం సిటీ: ఎస్టీయూ 79వ వార్షిక సమావేశం అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి భవన్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆ శాఖ జిల్లా అధ్యక్షుడిగా ఎన్.రమణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్.రామాంజనేయులు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్థిక కార్యదర్శిగా మల్లికార్జున, జిల్లా కార్యవర్గ సభ్యులుగా మరో 20 మందిని, రాష్ట్ర కౌన్సిలర్లుగా ఇంకో 17 మందిని ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకుడిగా నాగరాజు హాజరయ్యారు.
ప్రభుత్వ డ్రైవర్ల సంఘం నూతన కమిటీ ఎన్నిక
ప్రభుత్వ డ్రైవర్ల సంఘం నూతన కమిటీ ఎన్నిక


