‘సంతకమే’ సమర శంఖం
అనంతపురం: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణకు జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. పార్టీలకు అతీతంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు తరలివచ్చి సంతకాలు చేసి చంద్రబాబు సర్కారు తీరుపై సమర శంఖం పూరిస్తున్నారు. పేదలకు మెరుగైన వైద్యం.. వైద్య విద్య అందకుండా దూరం చేసే కుట్రలను సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు.
● కళ్యాణదుర్గం నియోజకవర్గం మాకోడికి గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన సంతకాల ప్రతులను వైఎస్సార్‌సీపీ నాయకులు ఆదివారం మాజీ ఎంపీ తలారి రంగయ్యకు అందజేశారు. కార్యక్రమంలో కళ్యాణదుర్గం మండల కన్వీనర్ ఎంఎస్ హనుమంత రాయుడు, సర్పంచ్ సత్యనారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ ముత్యాలు, నాయకులు మంజునాథరెడ్డి, శెట్టూరు, తిప్పేస్వామి, హరినాథరెడ్డి, ప్రతాప్, వీరాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.
● ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామ పంచాయతీలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్సార్ విద్యార్థి విభాగం రాయలసీమ, యుజవన విభాగం జోనల్ అధ్యక్షుడు వై.ప్రణయ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు కరణం భీమరెడ్డి, భరత్‌రెడ్డి, కన్వీనర్ కురుబ రమేష్, మండల ఉపాధ్యక్షుడు బోయ నాగేంద్ర, కురువ గురిబాబు, యువజన వభాగం బోయ వన్నూర్ స్వామి, డిష్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
● శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం చెర్లోపల్లి, కుమ్మనమల గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు కోటి సంతకాల సేకరణ చేపట్టారు. సంతకాలు చేసిన పత్రాలను వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పొన్నపాటి మహేశ్వరరెడ్డికి నాయకులు తిరుపాలరెడ్డి ,శ్రీరాములు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీల
ప్రైవేటీకరణపై ఆగ్రహం
చంద్రబాబు ప్రభుత్వంపై
తీవ్రస్థాయిలో మండిపాటు
స్వచ్ఛందంగా ముందుకొచ్చి
సంతకాలు చేస్తున్న ప్రజలు
‘సంతకమే’ సమర శంఖం


