రూ.10 వేల అప్పు మాఫీ కోసమే విజయలక్ష్మి హత్య
గుత్తి: గత నెల 28న హత్యకు గురైన దుద్దేకుంట విజయలక్ష్మి కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. శనివారం సాయంత్రం గుత్తి పోలీసు స్టేషన్‌లో కేసు వివరాలను సీఐ రామారావు, ఎస్‌ఐ సురేష్‌తో కలిసి డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. పట్టణానికి చెందిన దుద్దేకుంట విజయలక్ష్మి అనే మహిళ ఇంట్లో ఆటో డ్రైవర్ రాము, భార్య అలీసమ్మ అద్దెకుంటున్నారు. విజయలక్ష్మి నుంచి రాము రూ.10 వేలు అప్పు తీసుకున్నాడు. అసలు చెల్లించలేదు. వడ్డీ కట్టలేదు. విజయలక్ష్మిని చంపేస్తే అప్పు మాఫీ అవుతుందని ఆమెను హత్య చేసేందుకు పథకం వేశారు. ఈ క్రమంలో గత నెల 26న విజయలక్ష్మి తోట నుంచి ఇంటికి వెళ్తుండగా రాము, అలీసమ్మ అడ్డగించారు. ఆమెను గొంతు నులిమి చంపారు. ఆమె మెడలో ఉన్న 22 గ్రాముల బంగారు గొలుసు లాక్కున్నారు. మృతదేహాన్ని ఆటోలో వేసుకొని గుంతకల్లు మండలం వైటీ చెరువు గ్రామ చెరువులో పడేశారు. విజయలక్ష్మి కొడుకు, సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కేసును ఛేదించడానికి పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడ్డారు. అలీసమ్మ ఫోన్‌కు కొసమట్టం ఫైనాన్స్ కంపెనీ నుంచి తరచూ మెసేజ్‌లు వచ్చాయి. రాము, అలీసమ్మపై అనుమానంతో మెసేజ్‌లు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పోలీసులు చాక చక్యంగా కేసును ఛేదించారు. పోలీసులు రాము ఆటోను సీజ్ చేసి, బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌కు జడ్జి ఆదేశించినట్లు సీఐ చెప్పారు. కేసును ఛేదించిన సీఐ రామారావు, ఎస్‌ఐ సురేష్, కానిస్టేబుళ్లు భాస్కర్ నాయుడు, కిశోర్, అశోక్ ప్రత్యేక బృందాలను ఎస్పీ జగదీష్, డీఎస్పీ శ్రీనివాస్ అభినందించారు.
ప్రభుత్వ డ్రైవర్ల సంఘం
జిల్లా అధ్యక్షుడిగా రమేష్‌బాబు
అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా పి.రమేష్‌బాబు (రెవెన్యూ) ఎన్నికయ్యాడు. శనివారం నగరంలోని ప్రభుత్వ డ్రైవర్ల సంఘం భవనంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్‌జీఓ జిల్లా జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, సిటీ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి, ఆలిండియా గవర్నమెంట్ డ్రైవర్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ వై.నాగేశ్వరావు హాజరయ్యారు. వారి సమక్షంలో రమేష్‌బాబును జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. కార్యక్రమంలో డ్రైవర్లు పి. నాగభూషణం. హెచ్‌ఎం బాషా, మల్లికార్జున, అయూబ్, నారాయణస్వామి, ఖాజా సాబ్, బాబు, వెంకటరాముడు, విశ్రాంత ఉద్యోగులు ఎన్‌ఎస్ వరదరాజులు, భాస్కర్ పాల్గొన్నారు.
రూ.10 వేల అప్పు మాఫీ కోసమే విజయలక్ష్మి హత్య
రూ.10 వేల అప్పు మాఫీ కోసమే విజయలక్ష్మి హత్య
రూ.10 వేల అప్పు మాఫీ కోసమే విజయలక్ష్మి హత్య


