విరగ్గాసిన దానిమ్మ
ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం కమ్మూరు గ్రామంలో రైతు రంగారెడ్డి సాగు చేసిన దానిమ్మ పంట విరగ్గాసింది. టన్ను ధర 1.25 లక్షల నుంచి రూ.1.50 లక్షలతో అమ్ముడుపోతుండడంతో రైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉచిత పంటల బీమా పథకంతో ఆదుకోవడంతో రూ.లక్ష వరకూ లబ్ధి చేకూరిందని, ఈ మొత్తాన్ని తిరిగి పంటపైనే ఖర్చు పెట్టడంతో నాణ్యమైన దిగుబడులు సాధ్యమయ్యాయని వివరించాడు. జగన్ ప్రభుత్వమే ఆదుకోకుంటే ఈ దిగుబడి ఉండేది కాదని తెలిపాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీమా ఊసే లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశాడు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం:


