
సీపీఎస్ రద్దు చేయాలి
తాడిపత్రిటౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హమీలను నెరవేర్చలేదంటూ ఏపీటీఎఫ్ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వ మోసాన్ని నిరసిస్తూ తాడిపత్రిలోని పురపాలక పాఠశాలలో గురువారం నుంచి ఈ నెల 17వ తేదీ వరకూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీటీఎఫ్ పూర్వ అధ్యక్షుడు రఘురామిరెడ్డి మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి వెంటనే పాత పెన్సన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. 12వ పీఆర్‌సీని నియమించి వెంటనే ఐఆర్ ప్రకటించాలన్నారు. అన్ని రకాల బకాయిలు చెల్లించాలన్నారు. ఈహెచ్‌ఎస్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలన్నారు. యాప్‌లను, అసెస్మెంట్ బుక్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు జయచంద్ర, సుధాకర్‌రావు, రంగనాథ, లీలావతి, మల్లికార్జున, ఉపేంద్రం, జనార్దనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.