
● మరికొన్ని పొడిగింపు
గుంతకల్లు: వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సీహెచ్ రాకేష్ ఓ ప్రకటనలో తెలిపారు. పూరి – యశ్వంత్‌పూర్ (22883/84) ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఎసీ–3 టైర్ బోగీని అదనంగా ఏర్పాటు చేశామన్నారు. బెళగావి – సికింద్రాబాద్ (07335/36) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జాలై 31 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. శివమెగ్గ – చైన్నె సెంట్రల్ (06223/24) ఎక్స్‌ప్రెస్ రైళ్లను జూన్ 28 వరకు పొడిగిసున్నట్లు వివరించారు.
మహిళపై చిరుతపిల్లల దాడి
రాప్తాడు: చిరుతపిల్లల దాడిలో మహిళ గాయపడిన ఘటన మండలంలోని ఎం.చెర్లోపల్లిలో చోటుచేసుకుంది. గురువారం ఉదయం గ్రామంలోకి రెండు చిరుత పిల్లలు ప్రవేశించి స్థానికులను భయభ్రాంతులకు గురి చేశాయి. సుబ్బలక్ష్మి అనే మహిళ తలపై కరిచాయి. గ్రామస్తులు కేకలు వేయడంతో చెరువు వైపు పరుగులు తీశాయి. అటవీశాఖ అధికారులు ఆ పరిసరాలను జల్లెడ పట్టారు. మళ్లీ చిరుతలు కనబడితే సమాచారం ఇవ్వాలని కోరారు.
అర్హులనే ఆశాలుగా నియమించాలి
అనంతపురం సప్తగిరి సర్కిల్: అర్హులనే ఆశా కార్యకర్తలుగా నియమించాలని డీఎంహెచ్‌ఓ వీరబ్బాయి ఆదేశించారు. స్థానిక తన కార్యాలయం నుంచి వైద్యాధికారులతో గురువారం సెల్‌కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆశాల నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఆశాల నియామకాల్లో పూర్తి పారదర్శకత పాటించాలని ఆదేశించారు.
న్యూస్‌రీల్
