
కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీకి వినతిపత్రం అందిస్తున్న ఎంపీ తలారి రంగయ్య
అనంతపురం క్రైం: అనంతపురం ఎంపీ తలారి రంగయ్య బుధవారం పార్లమెంట్ కార్యాలయంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీని కలిశారు. జాతీయ రహదారుల అభివృద్ధి పనులు, పెండింగ్ పనుల గురించి చర్చించారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఇదే రోజు ఢిల్లీ విమానాశ్రయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎంపీ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
ఓటరు జాబితా ప్రక్రియలో నిర్లక్ష్యం వీడండి
అనంతపురం సిటీ: ఓటరు జాబితాలో మార్పు, చేర్పులకు సంబంధించిన ప్రక్రియలో నిర్లక్ష్యం వీడాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి కె.భాస్కర్‌రెడ్డి ఆదేశించారు. ఈ అంశానికి సంబంధించి ఆయన బుధవారం ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు (ఎన్నికల విభాగం), మండల స్థాయి అధికారులు, బూత్ లెవల్ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు జాబితాలో పేర్లు, పుట్టిన తేదీ, చిరునామా, ఒక చోట నుంచి మరో ప్రాంతానికి ఓటు బదిలీ, ఆధార్‌తో అనుసంధానం వంటి అంశాలకు సంబంధించి సేకరించిన దరఖాస్తులను చాలా మంది ఇప్పటికీ జిల్లా కార్యాలయాలకు చేర్చలేకపోయారని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే దరఖాస్తులను జిల్లా కార్యాలయాలకు చేర్చడంతో పాటు ఏ ఒక్క పనీ పెండింగ్‌లో లేకుండా చూడాలని ఆదేశించారు. లేకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ జల్లా శ్రీనివాసులు, అకౌంట్స్ ఆఫీసర్ అమృత్‌రాజ్ పాల్గొన్నారు.