
అనంతపురం క్రైం: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే అన్ని వర్గాల అభ్యున్నతి సాధ్యమని జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ పేర్కొన్నారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుస్సేన్‌పీరా ఆధ్వర్యంలో ట్రేడ్ యూనియన్ పార్టీ జెండా ఆవిష్కరించారు. జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం వైఎస్ జగన్ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చారన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి మరోసారి వైఎస్ జగన్‌ను సీఎంని చేసుకుందామని పిలుపునిచ్చారు. మున్సిపల్ పారిశుధ్య, ఇంజినీరింగ్ కార్మికుల వేతనాలు పెంచి జీవితాల్లో వెలుగులు నింపారని మేయర్ వసీం అన్నారు. ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుస్సేన్ పీరా మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 1,35,000 మందికి ఉద్యోగాలు కల్పించారన్నారు. కార్యక్రమంలో నాటక అకాడమీ రాష్ట్ర చైర్‌పర్సన్ హరిత, రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న, ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన్ లిఖిత, మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, వక్ఫ్‌బోర్డు జిల్లా చైర్మన్ కాగజ్‌ఘర్ రిజ్వాన్, పార్టీ అనుబంధ బీసీ సెల్ జోనల్ కార్యదర్శి రమేష్‌గౌడ్, అనుబంధ విభాగం జిల్లా అధ్యక్షులు సైఫుల్లాబేగ్, ఉమ్మడి మదన్‌మోహన్ రెడ్డి, పార్టీ నగర అధ్యక్షురాలు కృష్ణవేణి, కార్పొరేటర్ కమల్‌భూషణ్, నాయకులు అనిల్‌కుమార్‌గౌడ్, కొండమ్మ పరమేష్, శోభారాణి, రాధాయాదవ్, భారతి, తదితరులు పాల్గొన్నారు.