
హుండీ కానుకలను లెక్కిస్తున్న దృశ్యం
నార్పల: గూగూడు కుళ్లాయిస్వామి హుండీ కానుకల లెక్కింపును సోమవారం చేపట్టారు. రూ.16,95,130 ఆదాయం సమకూరినట్లు దేవదాయ శాఖ ఈఓ శోభ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ శివశంకర్‌రెడ్డి, సర్పంచ్ రమణకుమారి, ఎంపీటీసీ సభ్యుడు రాజారెడ్డి, కో–ఆప్షన్ సభ్యురాలు షాబీరా, గ్రామస్తులు లింగారెడ్డి, గోపాల్ పాలొన్నారు.
30 నుంచి మోటార్
రీవైండింగ్‌పై ఉచిత శిక్షణ
అనంతపురం: రూడ్‌సెట్ సంస్థలో ఈ నెల 30 నుంచి మోటార్ రీవైండింగ్‌పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ లోక్‌నాథరెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నెల రోజుల శిక్షణా కార్యక్రమంలో ఉచిత వసతితో పాటు భోజన సదుపాయాలు కల్పిస్తారు. ఆసక్తి ఉన్న ఉమ్మడి జిల్లాకు చెందిన యువకులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు 96188 76060, 94925 83484లో సంప్రదించవచ్చు.
రహదారిపై గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం
గుత్తి రూరల్: మండలంలోని కొత్తపేట శివారులో 44వ జాతీయ రహదారిపై సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బైపాస్ రోడ్డు డివైడర్‌పై పడి ఉన్న మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతుడు తెల్ల అంగీ, నలుపు రంగ ప్యాంట్ ధరించాడు. ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని ఎస్‌ఐ శ్రీనివాసులు కోరారు.

వృద్ధుడి మృతదేహం