రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మృతి

May 6 2026 7:55 AM | Updated on May 6 2026 7:55 AM

యలమంచిలి రూరల్‌: మండలంలోని పులపర్తి సమీపంలో 16వ నంబరు జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్‌ మృతి చెందాడు. విశాఖపట్నం పోర్టు నుంచి బొగ్గు లోడుతో హైదరాబాద్‌ వెళ్తున్న లారీని యలమంచిలి దాటిన తర్వాత పులపర్తి కూడలి సమీపంలో నిర్మాణంలో ఉన్న నయారా పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆపి టైర్లలో గాలిని డ్రైవర్‌ పులగల సుబ్రహ్మణ్యం(32) తనిఖీ చేసుకుంటుండగా అనకాపల్లి నుంచి తునివైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందినట్టు యలమంచిలి రూరల్‌ ఎస్‌ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు.మృతుడు పాయకరావుపేట మండలం వి. కొత్తూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.మృతుని బావ గారా సంజీవరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement