కోటవురట్ల: ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఏలేరు కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాలివి..నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి జోగినాధునిపాలేనికి చెందిన మాజీ కౌన్సిలర్ వర్రి శ్రీనివాసరావు(48) యండపల్లి వద్ద ఏలేరు కాలువలోకి సోమవారం సాయంత్రం దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలేరు కాలువ వద్ద శ్రీనివాసరావు చెప్పులు, కారు ఉండడంతో అతని భార్య నర్సీపట్నం పోలీసు స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేసింది. అక్కడ మిస్సింగ్ కేసు నమోదు చేయగా మంగళవారం ఉదయం యండపల్లి ఏలేరు కాలువలో అతని మృతదేహం తేలింది. అప్పులు పెరిగిపోవడంతో తట్టుకోలేక ఏలేరు కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని బంధువులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.


