ఏపీడీపీఎంఎస్‌పై శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ఏపీడీపీఎంఎస్‌పై శిక్షణ

May 6 2026 7:55 AM | Updated on May 6 2026 7:55 AM

శిక్షణ కార్యక్రమంలో అతిథులు, ఆహ్వానితులు

బీచ్‌రోడ్డు: భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏపీడీపీఎంఎస్‌(అప్‌డేటెడ్‌ వెర్షన్‌)పై శిక్షణ కార్యక్రమాన్ని వీఎంఆర్డీఏలో మంగళవారం నిర్వహించారు. ఆర్‌డీడీటీపీ చామంతి మార్గదర్శకత్వంలో సాఫ్ట్‌టెక్‌ బృందం ఆధ్వర్యంలో శిక్షణ జరిగింది. అప్‌డేటెడ్‌ వెర్షన్‌లోని కొత్త ఫీచర్లు, డ్రాఫ్టింగ్‌ టూల్స్‌, బిల్డింగ్‌ అప్లికేషన్స్‌, లేఅవుట్‌ అప్లికేషన్స్‌ ఆన్‌లైన్‌ ప్రాసెస్‌పై సమగ్ర అవగాహన కల్పించారు. అప్లికేషన్‌ సమర్పణ నుంచి ఆమోదం వరకు ఉండే దశలను ప్రాక్టికల్‌గా వివరిస్తూ పాల్గొన్నవారికి శిక్షణ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement