అనకాపల్లి : మండలంలో శంకరం రైల్వే బ్రిడ్జి సమీపంలో సుమారు 60 సంవత్సరాలు మహిళలను విజయవాడ–విశాఖ రైల్వే ట్రాక్‌లపై సోమవారం రాత్రి గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు దువ్వాడ జీఆర్పీ ఎస్‌ఐ కె.టి.ఆర్.లక్ష్మి మంగళవారం తెలిపారు. స్థానికలు, రైల్వే గ్యాంగ్ మ్యాన్ ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా మృతురాలు గ్రీన్ కలర్ చీర ధరించి ఉన్నట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలు వద్ద ఉన్న బ్యాగ్ ఆధారంగా ఆమె యాచకురాలుగా గుర్తించడం జరిగిందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించడం జరిగిందని ఎస్‌ఐ చెప్పారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్.7382058996ను సంప్రదించాలన్నారు.


