పాలిసెట్‌ ఫలితాల్లో 90.64 శాతం ఉత్తీర్ణత | - | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌ ఫలితాల్లో 90.64 శాతం ఉత్తీర్ణత

May 6 2026 7:55 AM | Updated on May 6 2026 7:55 AM

తుమ్మపాల: పాలిసెట్‌–2026 ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. 90.64 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు పాలిసెట్‌ జిల్లా కోఆర్డినేటర్‌ ఐ.వి. ఎస్‌.ఎస్‌.శ్రీనివాసరావు తెలిపారు.బాలురు 4,468 (88.48 శాతం), బాలికలు 3,673 (93.41 శాతం) మొత్తం 8,141 మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొ న్నారు. జిల్లాకు చెందిన మొసూరి హర్షవర్ధన్‌ ఆదిత్య 85వ ర్యాంక్‌, కాపుశెట్టి గుణ దీపిక వెంకట సాయిశ్రీ 158వ ర్యాంక్‌, గాది యశ్వంతి 163వ ర్యాంక్‌ సాఽధించారు.

కె.కోటపాడు: పాలిసెట్‌–2026 ఫలితాల్లో కె.కోటపాడు మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. కింతాడ పంచాయతీకి చెందిన కిలపర్తి సృజన్‌ 120 మార్కులకు గాను 119 మార్కులు సాధించి 36వ ర్యాంక్‌ సాధించాడు. యరకన్నపాలెం విద్యార్థిని గాడి యశ్వంతి 120 మార్కులకు 117 మార్కులను సాధించి 116వ ర్యాంక్‌ పొందింది.

దేవరాపల్లి: దేవరాపల్లికి చెందిన విద్యార్థిని వెత్సా షణ్ముఖి 39వ ర్యాంక్‌ సాధించింది. 120 మార్కులకు గాను 119 మార్కులు పొందింది. కాగా ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో షణ్ముఖి 588 మార్కులు సాధించింది. ఈమె తండ్రి వెత్సా జోగిరాజు (రాజేష్‌) రేషన్‌ డీలర్‌గా పని చేస్తుండగా, తల్లి పరమేశ్వరీ మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ నిర్వహిస్తున్నారు.మంచి ర్యాంక్‌ సాధించిన షణ్ముఖిని గ్రామానికి చెందిన పలువురు అభినందించారు.

ఈ సందర్భంగా షణ్ముఖి మాట్లాడుతూ సివిల్స్‌లో మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని తెలిపింది. దేవరాపల్లిలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పాలిసెట్‌ కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందిన పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంక్‌లు సాధించారు. తమటపు గోపిచంద్‌ 1,533వ ర్యాంక్‌, లక్కరాజు అనుష్క 4,174వ ర్యాంక్‌, కాటా భరత్‌కుమార్‌ 4,562వ ర్యాంక్‌, టి.ఉష 5,292వ ర్యాంక్‌, పరవాడ చందన 6,438వ ర్యాంక్‌, జి. హేమలత 7,708వ ర్యాంక్‌ను సాధించారు. వీరికి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కె.వి.రమణ, జిల్లా ఉపాధ్యక్షుడు కొరుప్రోలు శ్రీను, గంగవంశం సంతోష్‌, ఉపాధ్యాయులు పెద్దాడ వెంకటరమణ, వేచలపు అప్పలనాయుడు తదితర్లు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement