షార్ట్‌ సర్క్యూట్‌తో క్వారీ లారీ దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో క్వారీ లారీ దగ్ధం

May 6 2026 7:55 AM | Updated on May 6 2026 7:55 AM

కోటవురట్ల : బ్యాటరీ షార్ట్‌ సర్క్యూట్‌తో క్వారీ లారీ దగ్ధమైంది. రాజుపేట శివారు పరదేశమ్మతల్లి ఆల యం సమీపంలో కోటవురట్ల వైపు వెళుతున్న క్వారీ లారీ ఇంజిను నుంచి మంగళవారం రాత్రి మంటలు రావడంతో లారీ డ్రైవర్‌, క్లీనర్‌ అప్రమత్తమయ్యారు. వెంటనే లారీని ఆపి కిందికి దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. బ్యాటరీ వద్ద షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో మంటలు చెలరేగినట్టు లారీ సిబ్బంది తెలిపారు. స్థానికులు ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పేశారు. లారీ ఇంజిను భాగంగా దాదాపు 70 శాతం దగ్ధమైనట్టు స్థానికులు తెలిపారు. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement