సీపీఎస్‌ రద్దు కోరుతూ వచ్చేనెల 1న నిరసన | - | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ రద్దు కోరుతూ వచ్చేనెల 1న నిరసన

Feb 8 2026 4:07 AM | Updated on Feb 8 2026 4:07 AM

సీపీఎస్‌ రద్దు కోరుతూ వచ్చేనెల 1న నిరసన

సీపీఎస్‌ రద్దు కోరుతూ వచ్చేనెల 1న నిరసన

అనకాపల్లి: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ మార్చి ఒకటో తేదీన విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు సీపీఎస్‌ ఎంపాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఉమామహేశ్వరరావు తెలిపారు. స్థానిక విజయరామరాజుపేట వద్ద అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సాగర ఘోష పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అధికారం చేపట్టిన వెంటనే సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేస్తామని మెరుగైన పెన్షన్‌ అమలు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు అవుతున్న ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నోరు మెదపడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు మళ్ల ఉమామహేశ్వరి, జిల్లా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణ్ణమోహన్‌, సభ్యులు గణేష్‌, ఆనంద్‌, పల్లా బాబ్జి, రామచంద్రరావు, జి.అర్జున్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement