క్షేత్రస్థాయిలో కొరవడిన నిఘా | - | Sakshi
Sakshi News home page

క్షేత్రస్థాయిలో కొరవడిన నిఘా

Feb 8 2026 4:07 AM | Updated on Feb 8 2026 4:07 AM

క్షేత్రస్థాయిలో కొరవడిన నిఘా

క్షేత్రస్థాయిలో కొరవడిన నిఘా

యలమంచిలి దిమిలిరోడ్డు కూడలి వద్ద దుకాణం నుంచి తెస్తున్న చికెన్‌ వ్యర్థాలు

చికెన్‌ వ్యర్థాల అక్రమ రవాణా,వాటిని చే పలకు మేతగా ఉపయోగించడాన్ని సీరియస్‌గా పరిగణించిన రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గత మార్చి నెలాఖరులో రాష్ట్రవ్యాప్తంగా మెరుపుదాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు.అన్ని జిల్లాల్లో ఇదే తరహాలో కోళ్ల వ్యర్థాల వాహనాలపై నిఘా పెట్టాలని డీజీపీ ఆదేశించినా క్షేత్రస్థాయిలో కనీస స్పందన కనిపించడంలేదు. తూతూ మంత్రంగా దాడులు జరుపుతున్నారు. నెలరోజుల క్రితం అనకాపల్లిలో పోలీసులు దాడులు జరిపి చికెన్‌ తరలిస్తున్న కొన్ని వాహనాలను పట్టుకున్నారు. విలేకరులు ఎవరైనా చికెన్‌ వ్యర్థాల వాహనాలను ఆపి ఫొటోలు తీయాలన్నా అక్రమార్కులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు.మా వాహనాలను అక్రమంగా ఆపుతున్నారంటూ మీడియా ప్రతినిధులపైనే ఫిర్యాదు చేసి,పోలీసుల సహకారంతో అక్రమ కేసులు సైతం బనాయిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement