చోడవరంలో మెగా జాబ్ మేళా రేపు
మెగా జాబ్ మేళా వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్, జేసీ జాహ్నవి
తుమ్మపాల: విద్యార్హతగల ప్రతి ఒక్కరికీ ఉద్యో గం అందించాలనే లక్ష్యంతో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. చోడవరంలో ఈ నెల 5న నిర్వహించనున్న జాబ్ మేళా వాల్‌పోస్టర్‌ను కలెక్టరేట్‌లో ఆమెతో పాటు జేసీ జాహ్నవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే మెగా జాబ్ మేళాలో 17 బహుళ జాతి కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి, 1,500 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారని చెప్పా రు. టెన్త్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, పీజీ విద్యార్హతలు గల 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల యువతీయువకులు జాబ్‌మేళాకు హాజరు కావచ్చని తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి డాక్టర్ ఎన్. గోవిందరావు మాట్లాడుతూ ఆసక్తి గల వారు తమ వివరాలను naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. రిఫరెన్స్ నంబర్‌తో పాటుగా బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్ల జెరాక్స్‌లతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు 94947 91935, 79811 02224 అనే ఫోన్‌నంబర్ల సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్వో ఎస్.సుబ్బలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.


