వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
మాట్లాడుతున్న కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందు కు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఎంపీడీవోలకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎంపీడీవోలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అందుకు సంబంధించిన సమాచారం సేకరించి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. రెండు వారాల్లో మళ్లీ అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో తాగునీటి పథకాలకు అధిక ప్రాధాన్యం కల్పించాలని, జల్‌జీవన్ మిషన్ పనులు పూర్తిచేసి ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందించాలన్నారు. ప్రతి మండలం, మేజరు పంచాయతీల్లో వరుసగా 25 సెంట్లు, 15 సెంట్ల స్థలాలను గుర్తించి, వాలీబాల్ కోర్టులు నిర్మించాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు కార్తీక వన భోజనాలు ఏర్పా టు చేస్తున్నట్లు చెప్పారు.ప్రతి షాపులో చెత్తబుట్టను ఉంచాలన్నారు. ప్లాస్టిక్ గ్లాసులు, సీసాలు విచ్చలివిడిగా రోడ్డుపై పారవేసే మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోవాలనిఆదేశించారు. డిప్యూటీ సీఈవో కె.రాజ్ కుమార్, డ్వామా పీడీ పూర్ణమాదేవి, గ్రామవార్డు సచివాలయాల అధికారి మంజులవాణి, ఈవోపీఆర్డీ నాగలక్ష్మి, డీపీవో సందీప్ పాల్గొన్నారు.


