గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్టు
నాతవరం: గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు మండలంలోని చమ్మచింత జంక్షన్ వద్ద ఎస్సై, సిబ్బందితో కలిసి సోమవారం తనిఖీలు నిర్వహించారు. గంజాయి రవాణా చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని రూ.40 వేలు విలువ చేసే ఎనిమిది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులో తిరువూరుకు చెందిన డి.దీపక్‌బాబు(24), కోయంబేడుకు చెందిన ఆర్.గౌతమ్(44), తిరువూరుకు చెందిన ఎ.హరీష్(22), కాకినాడ జిల్లా తుని మండలం రేఖవానిపాలేనికి చెందిన తుమ్మ అప్పారావు(60)లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు. ధారకొండలో గంజాయి కొనుగోలు చేసి తుని రైల్వే స్టేషన్ ద్వారా తమిళనాడుకు తరలిస్తున్నట్టు తమ విచారణలో తేలిందన్నారు.


