ఎస్పీ కార్యాలయానికి 85 అర్జీలు
అర్జీదారులతో మాట్లాడుతున్న ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌కు 82 అర్జీలు వచ్చాయి. అర్జీదారుల నుంచి ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీలు స్వీకరించి వారివారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భూ తగాదాలు–24, కుటుంబ కలహాలు–4, చీటింగ్ –5, ఇతర విభాగలకు చెందనవి–49 అర్జీలు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన కర్తవ్యమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్‌రావు, ఎస్‌ఐ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.


