ఎర్రమట్టి దిబ్బల విస్తీర్ణంపై సర్వే | - | Sakshi
Sakshi News home page

ఎర్రమట్టి దిబ్బల విస్తీర్ణంపై సర్వే

Nov 4 2025 7:32 AM | Updated on Nov 4 2025 7:32 AM

ఎర్రమట్టి దిబ్బల విస్తీర్ణంపై సర్వే

ఎర్రమట్టి దిబ్బల విస్తీర్ణంపై సర్వే

భీమునిపట్నం : బీచ్‌రోడ్డులోని ఎర్రమట్టి దిబ్బల విస్తీర్ణం ఎంతవరకు ఉందన్న దానిపై సోమవారం జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వారితో కలిసి ఆర్డీవో సంగీత్‌ మాథూర్‌ పర్యవేక్షణలో అధికారులు సర్వే నిర్వహించారు. ఈ ప్రాంతంలో మొత్తం 1,400 ఎకరాల మేరకు ఎర్రమట్టి దిబ్బలు విస్తీర్ణం ఉండగా ఇప్పుడు ఏవిధంగా ఉన్నాయి.. వాటి సరిహద్దులను గుర్తించే కార్యక్రమం చేపట్టారు. ఈ సర్వే ద్వారా పూర్తి స్థాయిలో ఎర్రమట్టిదిబ్బల సరిహద్దులు గుర్తించడం వల్ల.. ఇకపై వీటిని కూల్చివేత జరగకుండా అధికారులు తగిన చర్యలను తీసుకోవడానికి వీలవుతుంది. ఇందులో తహసీల్దారు రామారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement