రావికమతం: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మండలంలోని మేడివాడ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని మోపాడ భాగ్యశ్రీ ఎంపికై ంది. ఈమె విశాఖపట్నంలోని కై లాసగిరి వద్ద ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్ గ్రౌండ్‌లో సోమవారం జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబరిచింది. అండర్ –17 విభాగంలో 100, 200 మీటర్ల రన్నీంగ్‌తోపాటు లాంగ్‌జంప్‌లో సత్తా చాటి ప్రథమ స్థానంలో నిలిచిందని వ్యాయామ ఉపాధ్యాయులు ఎల్.మధుసూదన్, ఎస్ నారాయణరాజ్ తెలిపారు. భాగ్యశ్రీని హెచ్‌ఎం వి.రామారావు, ఉపాధ్యాయులు అభినందించారు.


