పోలీసు ఆయుధాల ప్రదర్శన
అనకాపల్లి: పోలీసు అమరవీరులు విధి నిర్వహణలో చూపిన త్యాగాలకు నివాళులర్పిస్తూ, జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఓపెన్‌హౌస్ కార్యక్రమాన్ని ఎస్పీ తుహిన్ సిన్హా ప్రారంభించారు. శాంతి భద్రతల విషయంలో పోలీస్‌లు ఉపయోగించే వివిధ రకాల ఆయుధాలను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీసులు విధులు నిర్వర్తించే సమయంలో ఉపయోగించే అత్యాధునిక ఆయుధాలు, పరికరాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు సమాజ రక్షణలో, శాంతి భద్రతల పరిరక్షణలో తమ ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తారన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ ఏటా పోలీస్ అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణలో
వాడే పరికరాలు..
ఆయుధాలు పరికరాలు ఏకె–47, పిస్టల్ గ్లోక్–17, కార్బన్, ఇన్సాస్ రైఫిల్, మల్టీ గ్యాస్ గన్ లాంచర్, గ్రెనేడ్ , భద్రతా పరికరాలు రైట్ గేర్ సెట్స్, బాంబ్ డిఫ్యూజల్ పరికరాలు, నైట్ విజన్, సెర్చ్ మెటల్ డిటెక్టర్లు, కమ్యూనికేషన్ పరికరాలైనా శాటిలైట్ ఫోన్, స్కానర్, వి.హెచ్.ఎఫ్ సెట్స్, రోబో సూట్, డాగ్ స్క్వాడ్ కు చెందిన బన్నీ (మత్తు పదార్థ గుర్తింపు), రియో (ట్రాకింగ్), లక్కీ (మందుపాతర గుర్తింపు), ఫింగర్ ప్రింట్, క్లూస్ టీం నేరస్తుల పరిశోధనలో సాక్ష్యాధారాల సేకరణ పద్ధతులు, విద్యార్థులు ఆసక్తిగా పరికరాలను పరిశీలించి, పోలీసు విభాగం పనితీరుపై ప్రశ్నలు అడిగి అవగాహన పొందారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహన్ రావు, సీఐలు టి.లక్ష్మి, లక్ష్మణమూర్తి, బాల సూర్యారావు, రమేష్, గఫూర్, రామకృష్ణారావు, మన్మథరావు, అశోక్ కుమార్, ఫింగర్ ప్రింట్స్ సీఐ విజయ, ఎస్సైలు, విద్యార్థులు, పోలీస్‌లు తదితరులు పాల్గొన్నారు.
పోలీసు ఆయుధాల ప్రదర్శన


