రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
అనకాపల్లి టౌన్: కర్నూలు జిల్లా మంత్రాలయంలో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్లను ఎంపిక చేశారు. మండలంలోని తుమ్మపాల క్రీడామైదానంలో ఆదివారం ఈ ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 98 మంది బాలురు, బాలికలు పాల్గొనగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది బాలురు, 14 మంది బాలికలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి దాడి శ్యాంప్రసాద్, మహారాజ్ వ్యాయామ ఉపాధ్యాయుడు పీలా వీరు నాయుడు, క్రీడా మండలి సభ్యులు నీలకఠం, డి.బి. సత్యనారాయణ, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.


