మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు ఇద్దరి ఎంపిక | - | Sakshi
Sakshi News home page

మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు ఇద్దరి ఎంపిక

Oct 29 2025 7:39 AM | Updated on Oct 29 2025 7:39 AM

మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు ఇద్దరి ఎంపిక

మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు ఇద్దరి ఎంపిక

అప్పలనరసయ్యకు సర్టిఫికెట్‌ అందిస్తున్న సీపీ

అనకాపల్లి: రాష్ట్ర స్థాయి 45వ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు అనకాపల్లి పట్టణానికి చెందిన విశ్రాంత ఎల్‌ఐసీ ఉద్యోగులు వి.అప్పలనరసయ్య, కె.అప్పలమూర్తి ఎంపికయ్యారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఈ నెల 26న విశాఖలో ఎంపిక పోటీలు జరిగాయి. 800, 1500 మీటర్ల రన్నింగ్‌ పోటీల్లో అప్పలనర్సయ్య, జావలిన్‌త్రో, షార్ట్‌ఫుట్‌ పోటీల్లో కె.అప్పలమూర్తి సత్తా చాటారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న వీరిని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి సర్టిఫికెట్లు అందజేసి, అభినందించారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబర్‌ 13, 14 తేదీల్లో గుంటూరు జిల్లా పెదమండిపూడి మండలం పలపర్రు ఎన్‌ఎన్‌ ప్రభుత్వ హైస్కూల్‌లో జరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement