 
															2400 క్యూసెక్కుల తాండవ నీరు విడుదల
నాతవరం: తాండవ రిజర్వాయర్ నుంచి స్పిల్‌వే గేట్ల ద్వారా నదిలోకి 2400 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నామని ఇరిగేషన్‌శాఖ ఈఈ బాల సూర్యం అన్నారు. తాండవ రిజర్వాయరు ప్రమాదస్ధాయి నీటి మట్టాన్ని మంగళవారం పరిశీలించారు. తాండవ రిజర్వాయరు ప్రమాదస్థాయి నీటి మట్టం 380 అడుగులు కాగా ఎగువ ప్రాంతం నుంచి అధికంగా నీరు రావడంతో ప్రాజెక్టు నీటిమట్టం 378 అడుగులకు చేరిందన్నారు. మంగళవారం సాయంత్రానికి 377,5 అడుగులు నీటి మట్టం ఉండగా, ఎగువ ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో నీరు ప్రాజెక్టులోకి 1200 క్యూసెక్కులు వచ్చి చేరుతుంన్నారు. తాండవ ప్రాజెక్టు ప్రమాద స్థాయి నీటి మట్టం తగ్గేంత వరకు సిబ్బంది నిత్యం పర్యవేక్షణ ఉండాలని డీఈ అనురాధ, జేఈ శ్యామ్‌కుమార్ సిబ్బందికి సూచించారు. నాతవరం మండలం పరిధిలో గల ఏటవతల గామాల ప్రజలు నదిలోకి దిగరాదన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు, తుని మండలాల పరిధిలో నదీ పరివాహక గ్రామాల ప్రజలు, పశువులు నదిలోకి దిగరాదని దండోర ద్వ్రారా తెలియజేశామన్నారు. తాండవ ప్రాజెక్ట్‌ను నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, ఎస్‌ఐ తారకేశ్వరరావు, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కె.సత్యనారాయణ పరిశీలించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
