 
															నిరుపేదలకు ఆసరా
బుచ్చెయ్యపేట: మోంథా తుపాను ప్రభావంతో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలు, బిచ్చగాళ్లకు వీఎస్సార్ ట్రస్టు అధ్యక్షుడు సత్యారావు అండగా నిలిచాడు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బిచ్చగాళ్లు, మతి స్థిమితం లేక రోడ్లపై తిరిగే వ్యక్తులు తినడానికి ఏమీ దొరక్క ఆకలితో అలమటిస్తున్నారు. విషయం తెలుసుకున్న పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్సార్ ట్రస్ట్ అధ్యక్షుడు వడ్డి సత్యారావు వడ్డాది, బంగారుమెట్ట, పేట రహదారుల్లో తిరిగే పలువురు పేదలు, బిచ్చగాళ్ల వద్దకు వెళ్లి వారికి రెయిన్ కోట్లు, ఆహార పొట్లాలు, మంచినీటి బోటళ్లు అందించి ఆకలిని తీర్చారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
