 
															మోంథాపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు
ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం సభ్యులతో
మాట్లాడుతున్న ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: మోంథా తుపాను సందర్భంగా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పోస్టు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ తుహిన్ సిన్హా హెచ్చరించారు. స్థానిక గాంధీనగరం ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా పరిధిలో అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే స్పందించి, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తుపాను ప్రభావం తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే పోలీసు, అత్యవసర సేవలను సంప్రదించాలని ఆయన కోరారు. ప్రజలు ప్రభుత్వం, వాతావరణ శాఖ, జిల్లా పోలీసు అధికారుల అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని చెప్పారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
