 
															హోంగార్డు కుటుంబానికి రూ.3.98 లక్షల అందజేత
అనకాపల్లి: నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు ఎం.సత్యనారాయణ కుటుంబానికి హోంగార్డులు రూ.3,98,610 విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో సత్యనారాయణ భార్య వెంకటలక్ష్మికి స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా హోంగార్డు అనారోగ్యంతో మృతి చెందినా, పదవీ విరమణ పొందినా అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు ఒక రోజు డ్యూటీ వేతనాన్ని స్వచ్ఛందంగా అందజేస్తున్నట్టు తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
