 
															లైఫ్ సైన్స్ సింపోజియం పోటీల్లో ప్రథమ స్థానం
పాయకరావుపేట: శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్ధ స్పేసెస్ డిగ్రీ కళాశాల బీఎస్సీ అగ్రికల్చర్, రూరల్ డెవలప్‌మెంట్ ప్రథమ సంవత్సర విద్యార్థినులు టి.వైష్టవి, కె.షైనీ, ఎం.రమ్య, ఎస్.శ్యామల, ఎం.శృతి, పి.శరణ్యల బృందం విశాఖ లైఫ్ సైన్స్ సింపోజియం 2025 పోస్టర్ ప్రెజెంటేషన్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించారని విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్ తెలిపారు. విశాఖపట్నంలో ఈ నెల 24 నుండి 26 వరకు జరిగిన బయో ఎడ్సార్బెంట్ ఫిల్టర్ సిస్టమ్ పై వారు తయారు చేసిన పరికరం పై ప్రెజెంటేషన్ ఇచ్చి ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ బయాలజీ శాస్త్రవేత్త, భారత ప్రభుత్వ శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కార గ్రహీత డాక్టర్ ఉందుర్తి నరసింహ దాస్ చేతుల మీదుగా బహుమతి, నగదు పురస్కారాన్ని అందుకున్నట్టు ఆయన తెలిపారు. టీక్యాబ్సి నిర్వహించిన ఈ పోటీల్లో వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొనగా తమ విద్యార్థులు ప్రథమ స్థానం కై వసం చేసుకోవడం ఆనందదాయకమని విద్యా సంస్థల అధినేత సిహెచ్.వి.కె నరపింహారావు అన్నారు. ఈ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థినులను ప్రిన్సిపాల్ డా.రామకృష్ణారెడ్డి, విద్యార్ధులు, ఉపాధ్యాయులు అభినందించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
