 
															జాతీయ స్థాయి యోగా పోటీలకు ఎంపిక
చోడవరం: జాతీయ స్థాయి యోగా పోటీలకు చోడవరం క్రీడాకారులు ఎంపికయ్యారు. విశాఖలో రెండ్రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో చోడవరం పతంజలి యోగా కేంద్రాల క్రీడాకారులు బంగారు పతకాలు సాధించారు. అండర్ –14–18 బాలికల విభాగంలో పందిరి వెన్నెలశ్రీ మొదటి స్థానం దక్కించుకుంది. బాలుర విభాగంలో గొంతిన లయవర్ధన్ ద్వితీయ స్థానం, పి. పవన్‌కుమార్ తృతీయ స్థానం సాధించారు. అండర్ –18–24 విభాగంలో పి. జ్యోతిక మొదటిస్థానం, ఎం. శ్రీహిత మూడో స్థానం, 28 ఏళ్ల విభాగంలో బి.అనూష్ మూడో స్థానం, పురుషుల విభాగంలో వి.రాజా, సంతోష్ నాల్గో స్థానంలో నిలిచారు. వీరంతా బాపట్లలో త్వరలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని పతంజలి యోగా కేంద్రం గురువు పుల్లేటి సతీష్ తెలిపారు. విజేతలను ఉషోదయ విద్యా సంస్థల చైర్మన్ జెర్రిపోతుల రమణాజీ, యోగా కేంద్రం కమిటీ ప్రతినిధులు డాక్టర్ బంగారు కృష్ణ, రెడ్డి అప్పారావు, రవితేజ, యోగా టీచర్ బోగవిల్లి గణేష్ కొట్టాపుహరి కిరణ్ భరిణికాన మోహన్‌కుమార్ అభినందించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
