 
															కుదిపేసిన కుండపోత
ప్రమాదకరంగా జలాశయాలు 
● 36.9 మి.మీ సగటు వర్షపాతం నమోదు
● 74 పునరావాస కేంద్రాల ఏర్పాటు
● సహాయక చర్యలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
● ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ప్రత్యేకాధికారి
● నేడు కూడా కుంభవృష్టి కురిసే అవకాశం
మండలం వర్షపాతం
(మి.మీ)
పరవాడ 66.8
సబ్బవరం 61.2
రాంబిల్లి 55
మునగపాక 49.8
అచ్యుతాపురం 49.2
నక్కపల్లి 48.4
కె.కోటపాడు 47.4
అనకాపల్లి 47.2
యలమంచిలి 42.8
కశింకోట 41.8
చోడవరం 25.2
రావికమతం 35.2
కోటవురట్ల 23.4
చీడికాడ 25.8
ఎస్.రాయవరం 33
బుచ్చెయ్యపేట 37.2
పాయకరావుపేట 34.8
నర్సీపట్నం 25.6
మాకవరపాలెం 25.4
మాడుగుల 20.8
రోలుగుంట 31.4
నాతవరం 17.6
గొలుగొండ 21.8
దేవరాపల్లి 17.6
తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు
సాక్షి, అనకాపల్లి:
మోంథా తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీగా వర్షాలు కురిశాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. రోజంతా ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడంతో జనజీవనం స్తంభించింది. గెడ్డలు, వాగులు పొంగుతున్నాయి. పలుచోట్ల రోడ్లపై నీరు పారుతోంది. పశువుల మేతకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీర ప్రాంత మండలాలైన పరవాడ, పాయకరావుపేట, అచ్యుతాపురం, ఎస్.రాయవరం, నక్కపల్లితో పాటుగా సబ్బవరం, కె.కోటపాడు మండలాల్లో భారీగా వర్ష పాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా సగటున 36.9 మి.మీ వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా పరవాడ మండలంలో 66.8 మి.మీ వర్షం కురిసింది. అత్యల్పంగా దేవరాపల్లి మండలంలో 4.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఎగువ ప్రాంతం నుంచి వర్షపు నీరు రావడంతో జలశయాలు ప్రమాదకరంగా మారాయి. చెరువులు, వాగులు, వంకలు మురుగు డ్రెయిన్లు పొంగి పొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి పల్లపు ప్రాంతాల్లో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. సముద్రం కల్లోలంగా మారడంతో పాయకరావుపేట, ఎస్.రాయవరం, నక్కపల్లి, అచ్యుతాపురం, పరవాడ మండలాల్లో గల తీర ప్రాంత గ్రామాల్లో మైరెన్ పోలీసు సిబ్బంది అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు, సందర్శకులు సముద్రంలోనికి వెళ్లకుండా గస్తీ కాస్తున్నారు. స్పెషల్ అధికారి వినయ్‌చంద్ ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ సూచనలు ఇస్తున్నారు. ముంపు ప్రాంతాలైన పరవాడ పెద్ద చెరువు, పి.బోనంగిలోని విద్యుత్ సబ్‌స్టేషన్, ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం తీరాలను కలెక్టర్ విజయ కృష్ణన్ సోమవారం సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ముత్యాలమ్మపాలెం తుపాను షెల్టర్‌లో భద్రత ఏర్పాట్లను ఎస్పీ తుహిన్ సిన్హా సోమవారం రాత్రి పరిశీలించారు. మంగళవారం రాత్రి లేదా బుధవారం తెల్లవారుజామున తుపాను కాకినాడ జిల్లాలో తీరం దాటే అవకాశం ఉన్నందున మంగళవారం అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
74 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
జిల్లాలో 74 తుపాను పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. పాయకరావుపేట మండలంలో 11, నక్కపల్లిలో 10, ఎస్.రాయవరం 5, చోడవరం 4, యలమంచిలి 1, సబ్బవరం 2, పరవాడ 3, మాడుగుల 2, గొలుగొండ 1, చీడికాడ 2, మాకవరపాలెం 1, కశింకోట 2, దేవరాపల్లి 2, అచ్చుతాపురం 2, అనకాపల్లి 1, మునగపాక 3, నాతవరం 2, కె.కోటపాడు 2, రోలుగుంట 1, నర్సీపట్నం 3, బుచ్చెయ్యపేట 2, కోటవురట్ల 3, రావికమతం 4, రాంబిల్లి మండలంలో 5 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి గర్భిణి తరలింపు
రావికమతం: చీమలపాడు పంచాయతీలోని గిరిజన గ్రామం నేరేడుబంద నుంచి తంబిలి రచ్చోని అనే గర్భిణిని కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు నవంబర్ 1న ప్రసవం జరిగే అవకాశం ఉందని డాక్టర్లు తేదీ చెప్పడంతో ముందు జాగ్రత్తగా డిప్యూటీ ఎంపీడీవో సీతారామస్వామి సిబ్బందితో కలిసి కొండ మీదకు వెళ్లి ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆమెను కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వమ్మవరంలో తాటాకింటిలో నివసిస్తున్న మంజేటి సత్యవతి, గంగరాజు కుటుంబాన్ని పునరావాస కేంద్రానికి తరలించారు. తహసీల్దార్ ఎస్వీ అంబేడ్కర్, ఎంపీడీవో మహేష్ సోమవారం రాత్రి మండల కేంద్రంలో ఉండి సహాయక చర్యలు చేపట్టారు.
రావికమతం: కల్యాణపులోవ జలాశయం నుంవి సోమవారం మూడు స్పిల్‌వే గేట్ల ద్వారా 250 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం గరిష్ట నీటిమట్టం 460 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 458.30 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. ఎగువ పరీవాహక ప్రాంతం నుంచి 200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.
వర్షపాతం వివరాలు (రాత్రి 8.30 గంటల వరకు)
నాతవరం: తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలకు తాండవ రిజర్వాయర్ నీటిమట్టం సోమవారం ఉదయం 378 అడుగులకు చేరడంతో స్పిల్‌వే గేట్ల ద్వారా నదిలోకి 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని ప్రాజెక్టు డీఈ అనురాధ తెలిపారు. తాండవ ప్రమాదస్ధాయి నీటిమట్టం 380 అడుగులు కాగా డేడ్‌స్టోరేజీ నీటిమట్టం 345 అడుగులుగా పరిగణిస్తారు. తాండవ ప్రధాన కాలువ ద్వారా కేవలం 100 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదల చేస్తున్నామన్నారు. ఇన్‌ఫ్లో అధికమైతే రాత్రి సమయంలో నీటి విడుదల పెరిగే అవకాశం ఉందన్నారు. తాండవ ఒడ్డున ఉన్న జాలరిపేట గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించామన్నారు. ప్రాజెక్టు జేఈలు శ్యామ్‌కుమార్, మధుబాబు, వర్క్‌ఇన్‌స్పెక్టర్లు నాగబాబు, అప్పారావు సిబ్బంది పాల్గొన్నారు.
కల్యాణపులోవ నుంచి 250 క్యూసెక్కులు..
 
							కుదిపేసిన కుండపోత
 
							కుదిపేసిన కుండపోత
 
							కుదిపేసిన కుండపోత
 
							కుదిపేసిన కుండపోత
 
							కుదిపేసిన కుండపోత
 
							కుదిపేసిన కుండపోత

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
