 
															హరహర మహాదేవ
● ఘనంగా కార్తీక తొలి సోమవారం పూజలు
● కిటకిటలాడిన శివాలయాలు
అనకాపల్లిలో కూరగాయలు మార్కెట్ వద్ద సాధువుల గుడిలో శివలింగానికి క్షీరాభిషేకం చేస్తున్న భక్తులు
వేల్పులవీధి కాళీవిశ్వేశ్వరాలయంలో ధ్వజస్తంభం వద్ద దీపారాధన చేస్తున్న మహిళలు
పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో తొలి సోమవారం జిల్లాలో శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. తెల్లవారు జాము నుంచే భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. ఉపవాస దీక్షతో పుణ్యస్నానాలు ఆచరించి, క్యూలైన్లలో నిలబడి దేవదేవుడిని దర్శించుకున్నారు. శివలింగానికి పాలధారతో అభిషేకం చేస్తూ, బిల్వదళాలతో పూజలు చేసి, తమ భక్తిని చాటుకున్నారు. పలు ఆలయాల్లో భక్తులు దీపాలు వెలిగించారు. అనకాపల్లి, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. –అనకాపల్లి
 
							హరహర మహాదేవ

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
