 
															విఘ్నేశునికీ తప్పని తిప్పలు
ప్రముఖ పుణ్యక్షేత్రం చోడవరం శ్రీ స్వయంభూ విఘ్నేశ్వరస్వామి గర్భాలయం కూడా నీట మునిగింది. స్వామివారి ప్రధానాలయం ఏనుగుబోదు చెరువు గర్భంలో ఉండటంతో భారీ వర్షాలకు చెరువు నిండిపోయింది. బుచ్చెయ్యపేట మండలంలో వడ్డాది పెద్దేరు డైవర్షన్ రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహించగా వరద నీటిలోనే ఆర్టీసీ బస్సులు, లారీలు, ఇతర వాహనానలు రాకపోకలు సాగిస్తున్నాయి. విజయరామరాజుపేట డైవర్షన్ రోడ్డును ఆనుకుని వరద నీరు ప్రవహిస్తోంది. వర్షం ఎక్కువైతే విజయరామరాజుపేట డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయేలా ఉంది. దీంతో మళ్లీ బీఎన్ రోడ్డులో రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం పొంచి ఉంది. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురైతే అక్కడ ప్రజల్ని తరలించడానికి విజయరామరాజుపేట హైస్కూల్, వడ్డాది ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రిలీఫ్ షెల్టర్లను ఏర్పాటు చేశారు.
చోడవరం: గర్భగుడిలోకి వరదనీరు రావడంతో నీట మునిగినశ్రీ స్వయంభూవిఘ్నేశ్వరస్వామి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
