 
															ప్రమాద స్థాయిలో పెద్దేరు
మాడుగుల: పెద్దేరు జలాశయం ప్రమాద స్థాయికి చేరుకుంది. జలాశయం గరిష్ట నీటిమట్టం 137 మీటర్లు కాగా ప్రస్తుతం 136. 20 మీటర్లకు చేరుకోవడంతో జలాశయం అధికారులు ప్రధాన గేట్ల ద్వారా 350 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. పెద్దేరు, తాచేరు, గొరిగెడ్డ, పాలగెడ్డ, ఉరకగెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. తుపాను ప్రభావం మరింత ఎక్కువైతే వీటికి ముంపు సమస్య ఎక్కువవుతుందని, వీరవిల్లి, గొటివాడ, అగ్రహారం, వీజేపురం, జంపెన, తదితర గ్రామాల ప్రజలు, రైతులు, అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ రమాదేవి తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
