 
															షాక్‌కు గురై యువకుడు మృతి
వ్యాన్‌పై పడిన విద్యుత్ తీగలు
కోటవురట్ల: విద్యుత్ తీగలు వ్యాన్‌పై పడిన ఘటనలో ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలివి. కృష్ణా జిల్లా ముచ్చర్ల గ్రామానికి చెందిన మొటేపల్లి గీతాకృష్ణ(22) మండలంలోని పందూరు శివారున ఉన్న 73 హిల్స్ లేఅవుట్‌లో పనిచేస్తున్నాడు. లేఅవుట్‌లోనే నివాసం ఉంటూ నిర్వహణ పనులు చేస్తుంటాడు. గురువారం మధ్యాహ్నం లేఅవుట్ నుంచి మినీ వ్యానును నడుపుకొంటూ పందూరు వస్తుండగా మార్గం మధ్యలో సిమెంట్ విద్యుత్ స్తంభానికి వ్యాను వెనక ఉన్న గార్డ్ రాడ్ తగులుకుని స్తంభం విరిగిపోయింది. దాంతో విద్యుత్ తీగలు వ్యాన్‌పై పడిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా వ్యాన్ అంతటికీ పాకింది. ఈ విషయాన్ని గమనించని గీతాకృష్ణ డోరు తీసి కిందికి దిగుతుండగా విద్యుత్ షాక్‌కు గురై కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు మండల కేంద్రంలోని సీహెచ్‌సీకి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతుని మేనమామ దాసరి వెంకట మధు గోపాల్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రమేష్ తెలిపారు.
 
							షాక్‌కు గురై యువకుడు మృతి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
