 
															బెంగళూరు–ఖరగ్‌పూర్ మధ్య స్పెషల్ రైలు
తాటిచెట్లపాలెం: కేఎస్‌ఆర్ బెంగళూరు–ఖరగ్‌పూర్– కేఎస్‌ఆర్ బెంగళూరు మధ్య (వయా కొత్తవలస మీదుగా) వీక్లీ స్పెషల్ రైలు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. కేఎస్‌ఆర్ బెంగళూరు–ఖరగ్‌పూర్(06263) వీక్లీ స్పెషల్ రైలు ఈ నెల 29న కేఎస్‌ఆర్ బెంగళూరులో ఉదయం 9.50 గంటలకు బయలుదేరుతుంది. మరుసటిరోజు ఉదయం 4.28 గంటలకు కొత్తవలస చేరుకుని.. అక్కడ నుంచి 4.30 గంటలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు ఖరగ్‌పూర్ చేరుకుంటుంది. ఖరగ్‌పూర్–కేఎస్‌ఆర్ బెంగళూరు(06264) వీక్లీ స్పెషల్ రైలు ఈ నెల 30న ఖరగ్‌పూర్‌లో సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.28 గంటలకు కొత్తవలస చేరుకుంటుంది. అక్కడ నుంచి 4.30 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 11.30 గంటలకు కేఎస్‌ఆర్ బెంగళూరు చేరుకుంటుంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
