 
															వైన్ షాపులో చోరీ
యలమంచిలి రూరల్: పట్టణంలోని వైఎస్సార్ కూడలి వద్ద ప్రధాన రహదారి పక్కనున్న ఎస్‌కేఎంఎల్ వైన్స్‌లో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు షాపు పైకప్పు రేకులు తొలగించి లోనికి ప్రవేశించారు. ముసుగులు ధరించి ఉన్న చోరులు ముందుజాగ్రత్తగా సీసీటీవీ వైర్లు కట్ చేసి, ఫుటేజీని, దుకాణం క్యాష్ కౌంటర్‌లో ఉంచిన రూ.20వేల నగదు, ఒక మద్యం సీసాను అపహరించుకుపోయారు. చోరీ సమాచారం అందుకున్న వెంటనే సీఐ ధనుంజయరావు,పట్టణ ఎస్సై కే సావిత్రి,సిబ్బంది మద్యం దుకాణానికి వెళ్లి చోరీ జరిగిన తీరును పరిశీలించారు.నిందితుల వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.
రూ.20వేల నగదు, సీసీ ఫుటేజీ అపహరణ

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
