 
															ప్రతి నియోజకవర్గానికి ఒక ఇసుక స్టాక్ పాయింట్
తుమ్మపాల: సామాన్య ప్రజలకు జిల్లాలో ఇసుక కొరత లేకుండా ఉండేందుకు ప్రతి నియోజకవర్గానికి ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర భూగర్భ గనుల, ఎకై ్సజ్ శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం గనులు, భూగర్భ, ఎకై ్సజ్ శాఖల పురోగతిపై రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేష్‌బాబు, కె. సూర్యనారాయణ రాజుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ జిల్లాలో ఇసుక కొరత లేకుండా చూడాలన్నారు. అవసరానికి మించి ఇసుక అవసరం అయితే మరికొన్ని స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక రీచ్‌లలో ఎడ్లబండి, ట్రాక్టర్‌ల సహాయంతో వాళ్ల సొంత అవసరలకు ఇసుకను తరలించుకోవచ్చన్నారు. మద్యం విక్రయాల్లో ఏపీ ఎకై ్సజ్ సురక్ష యాప్ ద్వారా మాత్రమే మద్యం దుకాణాల్లో అమ్మకాలు జరగాలన్నారు. బెల్ట్ షాపులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు మాట్లాడుతూ జిల్లాలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు, తరలింపు అర్ధరాత్రి పూట జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేసీ ఎం.జాహ్నవి, డీఆర్వో వై.సత్యనారాయణరావు, ఆర్డీఓలు షేక్ అయిషా, వివి.రమణ, గనులు, భూగర్భ శాఖ జిల్లా అధికారి ఎం.శ్రీనివాస్, జిల్లా ఎకై ్సజ్ అధికారి వి.సుదీర్, నీటి పారుదల శాఖ డిఈఈ త్రినాథ్, వివిధ రాష్ట్ర కార్పొరేషన్‌ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, మళ్ల సురేంద్ర బాబు, బత్తుల తాతయ్య బాబు, కె.విజయ్‌కుమార్ పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
